ఆధునిక టెక్నాలజీతో అందించనున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అవినీతికి పాల్పడకుండా అందరికీ అన్ని లభ్యమయ్యేటట్టు చర్యలు తీసుకోవడానికి కార్డు ఎంత ఉపయోగపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని పారిశ్రామిక ప్రాంత పిలకవానిపాలెం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన బాబు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు పారదర్శకంగా అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ స్మార్ట్ రేషన్ కార్డు విధానమని అన్నారు. అలాగే రేషన్ డీలర్లు అవినీతికి పాల్పడకుండా ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని, సచివాలయాలలో వీటిని అందజేస్తామన్నార.