శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ రహదారి సమీపంలో మంగళవారం ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. చలానాలు పెండింగ్ ఉన్నవారు వెంటనే చెల్లించాలని చెప్పారు. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి అని అన్నారు.