ములుగు జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాల వద్ద నేడు బుధవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివాహిత మహిళలు పసుపుతో గౌరమ్మను తయారు చేసి తమ పసుపు, కుంకుమలు కలకాలం బాగుండాలని, తమ భర్తల శ్రేయస్సు మరియు రక్షణ కోరుతూ ఈ పూజను నిర్వహించారు. అనంతరం పూజించిన పూలు, గాజులు ధరించి అమ్మవార్ల ఆశీర్వాదం పొందడం జరిగింది.