హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వాల్వో బస్సు జగ్గంపేట మండలం రామవరం శివారు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం సమయంలో రామవరం గ్రామానికి చెందిన తండూ రాజుబాబు రోడ్డు దాటుతుండగా బస్సు ఒక్కసారిగా రావడంతో ఢీ కొట్టింది. దీంతో రాజబాబు రహదారిపై పడడంతో తలకు తీవ్రంగా గాయాలు తగలగా చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్ సహాయంతో జగ్గంపేట సిహెచ్సికి తరలించారు.