కాలేశ్వరం వివాదాన్ని సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ సోమవారం మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి RTC చౌరస్తా మీదుగా నెహ్రూ పార్క్ వరకు చేరుకొని అక్కడి నుండి తిరిగి ఆర్టీసీ చౌరస్తా వరకు బిఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో బయటాయించి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం వివాదం పై ఉన్న సోయి యూరియా కొరతను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలనే డిమాండ్ చేశారు.