కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలం, టి.అన్నవరం గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త ప్రసాద్ ను టిడిపి గుండాలు అత్యంత దారుణంగా తీవ్రంగా దాడి చేశారని తెలిపారు. గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త ప్రసాద్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి అరాచక పాలనకు పరిమితం అయిందన్నారు.