Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి లోని సినిమా హాల్ సెంటర్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలు వీధిలో ఉన్న చెత్త చదరాన్ని ఆయన కార్మికులతో కలిసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు