రంగారెడ్డి జిల్లా: లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్ పార్క్ కాలనీవాసులు వరద మురుగునీటి సమస్యలపై ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు బుధవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. మురుగునీరు బయటికి పొంగి అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాలనీ అధ్యక్షుడు జగన్ రెడ్డి జెడ్ సి కి వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.