నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాస్ కార్యాలయానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేరుకున్నారు. రుస్తుం మైన్స్ కేసులో షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు అయింది. ఆదివారం సాయంత్రంలోపు విచారణ అధికారి ఎదుట హాజరై సంతకం పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుచరులతో కలిసి రూరల్ డిఎస్పి కార్యాలయానికి చేరుకున్న గోవర్ధన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సంతకం చేశారు.