కడప జిల్లా ప్రొద్దుటూరులో గణేశ్ ఉత్సవాలను సామరస్యంగా, ప్రమాద రహితంగా నిర్వహించుకోవాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రజలకు సూచించారు. శనివారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. DJలు, అశ్లీల కార్యక్రమాలు, రాత్రి 10 తర్వాత స్పీకర్లు నిషేధమని డీఎస్పీ .స్పష్టం చేశారు. నిమజ్జనం ప్రాంతంలో లైటింగ్, ఫైర్, అంబులెన్స్, వాలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.