మంత్రాలయం: మండలం మాలపల్లి చిలకల డోనలో ఉన్న పత్తి పంటను ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, మరియు మంత్రాలయం ఎంఏఓ జీరా గణేశ్ మంగళవారం పరిశీలించారు. వారు గ్రామాలలో ఉన్న పత్తి పంటలను పరిశీలించారు. పత్తి పంటలలో ఉన్న లద్దే పురుగుల గురించి ఆందోళన చెందవద్దని రైతులకు వ్యవసాయ అధికారి జీరా గణేశ్ సూచించారు. మెగ్నీషియం లోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలన్నారు. అనవసరంగా రసాయన మందులు పిచికారీ చేయొద్దన్నారు.