ఆనందపురం మండలం పందలపాకలోని 56వ బెటాలియన్ ఐటీబీపీ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ (జిడి)గా పనిచేస్తున్న జగదల నరేంద్ర నాథ్ (32), ఆర్.ఎస్.రంగాపురం గ్రామం, ధోనే మండలం, కర్నూల్ జిల్లాకు వ్యక్తిగా తెలిపారు. బెటాలియన్ ఇన్‌ఛార్జి సూరజ్ ప్రకాష్ జోషి ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి ఎస్ఐ సంతోష్ దర్యాప్తు చేస్తున్నారు.