కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చట్టబద్ధత లేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. అధికారికంగా మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఆ సమావేశానికి తాను హాజరయ్యానన్నారు. వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో ఆరోజు సమావేశం జరగలేదన్నారు. బుధవారం నాటి సమావేశానికి తాను, తమ కౌన్సిలర్లు వెళ్లలేదన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంపై కడప జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడని తెలిపారు.