శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని కుటాగుళ్ల సమీపంలో కదిరి నుంచి పులివెందుల వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రామాంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.