మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో గురువారం అధికారుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. మండల పరిధిలోని రైతులకు 90 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచినట్టు మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే రైతుల అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని తక్కువ మోతాదులో యూరియా వాడాలని సూచించారు.