సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభిమైన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో రైలు పట్టాలపై చిద్రమైన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.