జిల్లా కలెక్టరేట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం మధ్యాహ్నం 3:30 కు భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోని కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఇప్పుడు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పూర్తికాని బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయలేని వారు కలెక్టరేట్ గురించి మాట్లాడటం సరికాదన్నారు.