వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మద్యంతర బెయిలు మంజూరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మభ్యంతర బెయిలు మంజూరు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.