వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పురిటిలో బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు సోమవారం రాత్రి 9:30 కు ఆందోళన చేపట్టారు. నిడమర్రు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ పురిటినొప్పులతో ఆదివారం ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యులు ఎవరు చూడకపోగా సోమవారం శస్త్రచికిత్సకు ఏర్పాటు చేస్తుండగా బిడ్డ మృతి చెందినట్లు చెప్పారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు.