పేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను దూరం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లె మీద నర్సింహులు నేతృత్వంలో నిరసనను వ్యక్తం చేశారు.