బొగ్గు లారీలు పేయాస్ లారీల దూలినుండి లంకెలపాలెం ప్రజలను కాపాడాలి* పరవాడ. బొగ్గు లారీలు ప్రేయాస్ లారీల కాలుష్యం అరికట్టాలని లంకెలపాలెం ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలు పరిమితికి మించి అధిక లోడలతో ప్రయాణించడం వలన తీవ్రమైన కాలుష్యం వెదజల్ల పడుతుందని దీనికి తోడు ఎన్టిపిసి ప్రేయసి లారీలు అధికలోళ్ళతో ఏ విధమైన తార్పానాలు కట్టకుండా ప్రయాణించడం వలన తీవ్రమైన ధూళి కాలుష్యం ఏర్పడుతోందన్నారు.