చేనేత భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతా పురుషోత్తం డిమాండ్ చేశారు. పెద్దపప్పూరు మండలం నర్సాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ ఇంతవరకు చేనేత భరోసా పథకాన్ని అమలు చేయలేదన్నారు. చేనేత కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పడతామన్నారు.