నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని యూరియా కోసం శనివారం రైతుల పలువురు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా అందించకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. సకాలంలో పంటలకు యూరియా వెయ్యకుండా ఉంటే పంటలు నష్టపోయే అవకాశం ఉందని దేనితో రైతు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.