వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం సిగ్గు చేటు: మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం లేదని సోమవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు తప్పుడు రాతలు రాస్తూ, కారు కూతలు కూస్తున్నారని మంత్రి మండిపడ్డారు.