శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శాంతి భవనానికి చేరుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం జేసీ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జ్ శైలజ, జూనియర్ సివిల్ జడ్జ్ సయ్యద్ ముజీబ్ పస్పల పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని భజనలో పాల్గొన్నారు.