కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో యూరియా ఎరువుల కొరతపై రైతులు శనివారం ఉదయం 11 గంటలకు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఎరువులను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ జాతీయ రహదారి 216పై ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందించడంలో విఫలమైందని గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు విమర్శించారు. పంటలకు యూరియా వేయకపోతే వరిచేలు పాడవుతాయని ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.