మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాల సందర్భంగా, జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో సర్కస్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎక్స్ పో-2025కు రావాలని, జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను, ఆయన క్యాంపు కార్యాలయంలో, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సారథ్యంలో బుధవారం సాయంత్రం 7గంటలకు ఆసంస్థ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈజన్మదిన మాసోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఒక లక్ష మందిని కుల మతాలకతీతంగా కలిసి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ఆయన జీవితంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను యావత్తు సమాజానికి తెలియపరచేందుకే ఈ కార్యక్రమం అన్నారు.