సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ అండర్‌పాస్ బ్రిడ్జ్ సమీపంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన వాసర హనుమంతు సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.