వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం ఎన్కి తండాలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు 40,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల ద్వారా గ్రామాలలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు ఉన్నాయని నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నేటికీ మూడు కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు