గోదావరి వరద ప్రభావిత లంక గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు పర్యటించారు. కనకాయలంకలో వరద నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనకాయలంక కాజ్‌వే సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.23 కోట్లతో ఫ్లైఓవర్ వంతెన మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు 24 గంటల పాటు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.