డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఏటూరునాగారం కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సూపర్డెంట్ సురేష్ కుమార్ తో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతీ రోగికి మంచి వైద్యాన్ని అందించాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు సంభవిస్తున్నాయని, అన్ని రకాల మందులు, పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.