కుప్పానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అభిమానులు అనంతపురంలోని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు శివ, సంపత్, ముత్తు, చిన్న తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.