ప్రకాశం జిల్లా కొండాపి మండలం అనకర్లపూడి గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన కోలాట కార్యక్రమం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. గ్రామంలో వినాయక చవితి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండగ వేడుకలలో భాగంగా చిన్నారులు యువతలతో కలిపి కమిటీ సభ్యులు కోలాటం నిర్వహించారు. దైవభక్తి పాటలకు చిన్నారులు యువతలు కోలాటం ఆడి పాడారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి కోలాటం చూసి ఆనందం వ్యక్తం చేశారు.