ఏటూరునాగారంలో శనివారం మీలాద్-ఉన్-నబీ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మసీదు నుంచి తాళ్లగడ్డ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. నిజాయితీ, కరుణ, సమానత్వం విలువలను మహమ్మద్ ప్రవక్త బోధించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా నడవాలని కోరారు.