గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్, పెద పలకలూరు రోడ్డులోని గోపికృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఖాళీ స్థలంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం అయ్యిందని సీఐ గంగా వెంకటేశ్వర్లుn శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని యువకుడు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు స్థానిక పట్టాభిపురం పోలీసులను సంప్రదించాలని సూచించారు.