గ్రేటర్ విశాఖపట్నం కొమ్మాది కేత్రీ కాలనీలోని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. కొద్ది రోజుల క్రితం కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మించేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానికులు సచివాలయానికి మూడుసార్లు ఫిర్యాదు చేయగా, అధికారులు వచ్చి ఆక్రమణను నిలిపివేశారు. అయితే, ఆక్రమణదారులు ఆదివారం మరోసారి అక్కడి వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న స్థలంలో షెడ్ వేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.