అచ్యుతాపురం మండలం చీమలాపల్లిలో ఘనంగా సీతారామ కళ్యాణ రాట మహోత్సవ కార్యక్రమం జరిగింది. గ్రామ పురోహితులు జయంతి నాగలింగ శాస్త్రి శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం వద్ద చలువ పందిళ్లు, పచ్చటి తోరణాలు, పసుపు పూలతోను ఆలయాన్ని ముస్తాబు చేశారు. బుధవారం జరగబోయే కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని పీటలపై గ్రామ సర్పంచ్ సియాద్రి నాగ నూకరాజు పద్మ దంపతులు నేతృత్వంలో స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు.