శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఘనగిరి విద్యానికేతన్ పాఠశాల ప్రభుత్వ సెలవు రోజు అయిన ఆదివారం 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఐఎస్ఏ, పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు ఆదివారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లి విద్యార్థులను తరగతులు నిష్క్రమించి ఇంటికి పంపి ధర్నా చేశారు. ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ.. సెలవు రోజు తరగతులు నిర్వహిస్తున్న ఘనగిరి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.