యూరియా కోసం బారులు తిరిన రైతులు మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం రైతులు బారులు తీరారు. గత వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న రైతులకు నేడు రెండు లారీల యూరియా రావడం విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. ప్రతి రైతుకు రెండు బస్తాల యూరియా సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అందరికి సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.