Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు పాత పెన్షన్ అమలు చేయాలంటూ తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మగౌరవ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు టీజీ సీపీ ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చారని,ఈ నేపథ్యంలో వెంటనే అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈనేపథ్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లో జరిగే ఆత్మగౌరవ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులుతరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.