నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా తిరుపతి పుణ్య క్షేత్రంకు తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుంచి తిరుపతి, మళ్ళీ ఏపీ రాష్ట్రం తిరుపతి నుండి చర్లపల్లికి స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు సెప్టెంబర్ 9 వ తేదీన ప్రారంభమవుతుందని నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం ప్రకటనలో తెలిపారు.తన అభ్యర్థన మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీ కారణంగా వారంతపు చర్లపల్లి-తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ నెలలో 9 వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు రైలు నెంబర్ 07013 ప్రతి మంగళవారం చర్లపల్లి నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తుందని వివరించారు