మురుకంబట్టు కొడిగుట్ట వద్ద లేఅవుట్ అప్రూవల్ కు చర్యలు చేపడుతున్నట్లు చుడా చైర్మన్ కటారి హేమలత, వైస్ చైర్మన్ జెసి విద్యాధరిలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోడి గుట్ట వద్ద లేఅవుట్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని మరో నెల రోజుల్లో ప్రజలకు చౌక ధరకే అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వం లేఅవుట్ అప్రూవల్ను సులభతరం చేసిందన్నారు. లే అవుట్ లలో 40 అడుగుల రోడ్డు స్థానంలో 30 అడుగుల రోడ్డుకి అప్రూవల్ కు అనుమతి ఇచ్చిందన్నారు. దీని ద్వారా మరింత ఎక్కువ ఫ్లాట్లు వేసుకునే అవకాశం ఉందన్నారు