యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఏడవ వార్డు డ్రైవర్ కాలనీలోని మోరీలు సిసి రోడ్లు శుభ్రత వంటి ప్రాథమిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మోత్కూర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మాట్లాడుతూ ఏడవ వార్డు కౌన్సిలర్ తీపి రెడ్డి సావిత్రి మెగారెడ్డి గత నాలుగేళ్లుగా చైర్మన్గా పనిచేసిన ఆ వార్డులో కనీస సమస్యలు పరిష్కారం జరగలేదని విమర్శించారు. కాలనీలోని సిసి రోడ్లు లేకపోవడం మురికి కాలువలు లేకపోవడం వలన వర్షాకాలంలో రోడ్లపై బురద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.