కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని తేరు రోడ్డులో వున్న విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉండి ప్రమాదం పొంచి ఉందని గురువారం స్థానికులు తెలిపారు. దాదాపు నెలరోజుల క్రితం లారీ విద్యుత్ స్తంభాన్ని డీ కొనడంతో క్రింద భాగం విరిగి ప్రక్కన వున్న స్తంబాన్ని అనుకోవడంతో విద్యుత్ శాఖ సిబ్బంది స్తంభం కింద పడకుండా తాడు, కడ్డీ సాయంతో పక్క స్తంభానికి కట్టారన్నారు. స్తంభం కూలి ప్రమాదం సంభవించక ముందే సంబంధిత అధికారులు విద్యుత్ ఫోల్ మార్చాలని స్థానికులు కోరుతున్నారు