రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.