సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ఆలయంలో అమ్మవారి ఘటస్థాపన తో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రదక్షణలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఈనెల 23 నుండి 28 వరకు అంతర్రాష్ట్ర భజన పోటీలు, హరికథా పారాయణం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.