గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం భారీ పిడుగులు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన మహిళలు దాసరి రాణి, దాసరి సవరమ్మ గా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పెదకాకాని పోలీసులు, రెవిన్యూ అధికారులు వివరాలు సేకరించారు.