ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను జనసేన పార్టీ లక్కిరెడ్డిపల్లి మండల ఇంచార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘనంగా జరిపారు.మొదట నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ..మా ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాన్యుడి పక్షపాతి, సామాజిక స్పృహ కలిగినవారు.