రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రేపటితో ఓటర్ల అభ్యంతరాలు పూర్తి అవుతాయని, రేపే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఉంటుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీడివో ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.ఈ సందర్బంగా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో,అయన మీడియాతో మాట్లాడుతూ.స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఓటర్ల డ్రాఫ్ట్ లను ఆయా గ్రామపంచాయితీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.ఓటర్ల డ్రాఫ్ట్ లో ఉన్న అభ్యంతరాలను రేపటిలోగా, అక్కడి గ్రామా పంచాయతి కార్యదర్శికి తెలపాలని కోరారు.