తంగళ్ళపల్లి మండల కేంద్రం శివారులో రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల నుండి సిద్దిపేట వైపు ద్విచక్ర వాహనంపై కొంగర నరేష్ ను సిద్దిపేట నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.